హన్మకొండ : సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చల్లో అంగీకరించిన అంశాలను అమలు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్.రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలను సి.హెచ్.రాంచందర్, సీఐటీయూ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టు రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చల సందర్భంగా అంగీకారం తెలిపిన అంశాలను అమలు చేయాలని ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. దీక్షల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు టి.ఎల్ల య్య, సెక్రటరీ ఉపేంద్రాచారి, నాయకులు శ్రీనివాస్, మహేందర్, కృష్ణమూర్తి, సమ్మయ్య, జగన్‌మోహన్, జమాలుద్దీన్, సంపత్, అంజయ్య, బాబు, ఓదెలు, అరుణకుమారి, రామారావు, మోహన్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు రాంచందర్


