వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పలు తీర్మానాలు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పలు తీర్మానాలు

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక అధ్యక్షతన మంగళవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనేక సమస్యలపై కమిటీ చర్చించి తీర్మానాలు చేసింది. అవి ఇలా ఉన్నాయి. ఏనుమాముల మార్కెట్‌ యార్డు అనుబంధం పర్వతగిరి, షోడశపల్లి సబ్‌ యార్డుల్లో గోదాముల నిర్మాణానికి, కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ముసలమ్మకుంట నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి భూమి అప్పగించడం , పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడం, తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశామని చైర్‌పర్సన్‌ తెలిపారు. వైస్‌ చైర్మన్‌ బండి జనార్దన్‌, సభ్యులు గజ్జెల శ్యామ్‌, రాజు, పూర్ణచందర్‌, వాసుదేవారెడ్డి, భిక్షపతి, నర్సింహ నాయక్‌, రుద్రప్రసాద్‌, ప్రదీప్‌ కుమార్‌, సంపత్‌, సబేర, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement