‘మీ ప్రమాణం’ యాప్‌ షురూ! | - | Sakshi
Sakshi News home page

‘మీ ప్రమాణం’ యాప్‌ షురూ!

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

‘మీ ప్రమాణం’ యాప్‌ షురూ!

కాశిబుగ్గ: ఇకపై వేళాపాళా లేకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది అలసత్వానికి చెక్‌ పడనుంది. కొందరు అధికారులతో పాటు సిబ్బంది సైతం ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఇక రావు. ఆన్‌లైన్‌ పర్యవేక్షణ ద్వారా సిబ్బంది వివరాలు తక్షణమే తెలిసిపోనుంది. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రమాణం యాప్‌ ఉపయోగపడనుంది. ఎంజీఎంలో సోమవారం నుంచి ‘మీ ప్రమాణం యాప్‌’ అమల్లోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వైద్య సిబ్బంది దాదాపు 1200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వీరంతా తమకు కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫోన్‌లో ఫేస్‌ రికగ్నేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్స్‌ కావాలన్నా ఈ యాప్‌ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా, పరిమితికి మించి సెలవులు పెట్టినా నిబంధనల ప్రకారం సాలరీ కట్‌ చేయనున్నట్లు సమాచారం.

ఎంజీఎం సిబ్బంది ఆలస్యానికి చెక్‌

పారదర్శకంగా విధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement