● సీఎంను కలిసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్‌పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.


