హైదరాబాద్‌లో ధర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ధర్మన్‌

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

రజనీకాంత్‌

హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు ధర్మన్‌ . రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్‌ ’. ‘ది డెడ్లీ డాక్టర్‌’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో సిమ్రాన్‌ , రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌ , ఆర్‌. మహేంద్రన్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో ధర్మన్‌ అనే డాక్టర్‌ గారజనీకాంత్‌ నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్‌పై కొన్ని కీలక సన్నివేశాలను, ఓ యాక్షన్‌ సీక్వెన్‌ ్సను చిత్రీకరించేలా అశ్వత్‌ ప్లాన్‌ చేశారట. అలాగే ఈ చిత్రంలో హీరో రామ్‌ పోతినేని ఓ కీలక పాత్రలో నటించనున్నారని, ఆయన క్యారెక్టరైజేషన్‌ ్సలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘ధర్మన్‌ ’ కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌లో అతి త్వరలో రామ్‌ కూడా పాల్గొంటారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో రజనీకాంత్‌–రామ్‌ మామ అల్లుళ్ళుగా కనిపిస్తారట. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ధర్మన్‌ ’ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement