● చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
హసన్‌పర్తి : తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్ప డిన అంతర్రాష్ట్ర దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. ఇటీవల వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలో వరుస చోరీల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆశిష్ శ్రీనివాస్‌రెడ్డి మల్ల.. ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈఏడాది మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని శివనగర్, ఎస్.ఆర్.ఆర్.నగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు రూ.29,875 నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. కాగా, గతంలో మహారాష్ట్రలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితుడు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైనట్లు డీసీపీ తెలిపారు.


