బార్ దగ్గర న్యూసెన్స్ చేస్తున్నాడని టీజీఎస్ పీసీని చితకబాదిన బీట్ కానిస్టేబుల్
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఓ బార్‌షాపులో మద్యంతాగి న్యూసెన్స్ చేస్తున్నాడని టీజీ ఎస్పీ కానిస్టేబుల్‌ను మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ బీట్ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరు కర్రలతో చితకబాదారు. ఈనెల 19న సాయంత్రం ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌షాపులో టీజీ ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్నాడని నిర్వాహకులు 112కు ఫిర్యాదు చేయడంతో బీట్ కానిస్టేబుల్ సంతోశ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. బెటాలియన్ కానిస్టేబుల్‌కు షర్టు వేసుకొని అక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించాడు. ఈ క్రమంలో అతడిని చెంపపై కొట్టడంతో అతను తిరిగి బీట్ కానిస్టేబుల్ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన బీట్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కర్రలతో టీజీఎస్పీ కానిస్టేబుల్‌ను చితకబాదినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై బీట్ కానిస్టేబుల్ గురువారం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, టీజీ కానిస్టేబుల్‌పై 132, 221 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, టీజీఎస్పీ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో లేవలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన వీడియో శనివారం సామాజిక మధ్యమాల్లో వైరలైంది. ఇరువురు కానిస్టేబుళ్ల మధ్య జరిగిన ఘటనపై పోలీస్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు తెలిసింది.


