‘వికసిత్‌ భారత్‌’కు అకౌంటింగ్‌ విధానాలు కీలకం | - | Sakshi
Sakshi News home page

‘వికసిత్‌ భారత్‌’కు అకౌంటింగ్‌ విధానాలు కీలకం

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

కేయూ క్యాంపస్‌ : వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో పారదర్శకత, విశ్వసనీయత అకౌంటింగ్‌ విధానాలు అత్యంత కీలకమని హైదరాబాద్‌లోని ఎన్‌ఎల్‌పీ కన్సల్టింగ్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోమరగిరి రాధాకృష్ణ అన్నారు.శనివారం కాకతీయ యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం, ఇండియన్‌ అకౌంటింగ్‌ అసోసియేషన్‌ వరంగల్‌ చాప్టర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ క్యాపిటలిస్ట్స్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌ –2047’ అంశంపై నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఫైనాన్స్‌ అకౌంటింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2047నాటికి వికసిత్‌భారత్‌ నిర్మించాలంటే ఆర్థికాభివృద్ధితోపాటు పారదర్శక పాలన అవసరమని కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం అన్నారు. సదస్సుకు కామర్స్‌అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. నర్సింహారావు అధ్యక్షత వహించారు. అనంతరం ఇండియన్‌ అకౌంటింగ్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షుడు కె.వి చలపతి, ఐఏఏ చాప్టర్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సి.హెచ్‌ రాజేశం, కార్యదర్శి కె. రాజేందర్‌, కేయూ ఓఎస్‌డీ వెంకట్రాంరెడ్డి, సదస్సు కన్వీనర్‌ పి. అమరవేణి, ఇండియన్‌ అకౌంటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గాబ్రియెల్‌ సైమన్‌తాటైల్‌, కార్యదర్శి సంజయ్‌భాయని, ఇండియన్‌ అకౌంటింగ్‌ మా జీ అధ్యక్షుడు వి. అప్పారావు మాట్లాడారు. విశ్రాంత ఆచార్యులు రాజిరెడ్డి, కృష్ణమాచార్య ఉన్నారు.

హైదరాబాద్‌ ఎన్‌ఎల్‌పీ కన్సల్టింగ్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎండీ రాధాకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement