కాజీపేట అర్బన్: కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీఆర్‌ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని, తెలంగాణ రాష్ట్ర అయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట మండలం టేకులగూడెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న రాజకీయ లబ్ధి ప్రచారం వల్ల పెద్ది సుదర్శన్‌రెడ్డికి రావాల్సిన సానుభూతి దెబ్బతింటోందని, దొంతి మాధవరెడ్డి కాదు.. తన కుమారుడు నిల్చున్నా నర్సంపేటలో విజయం సాధిస్తాడన్నారు. వైఎస్సార్ నగర్ కాలనీ స్థలం ప్రభుత్వ భూమి అని, దాన్ని బస్టాండ్, ఆస్పత్రి, కళాశాలలకు, ఏసీపీ కార్యాలయానికి కేటాయిస్తామన్నారు. కొండా సుస్మిత.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు, రాబోయే ఎన్నికల్లో సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే నిర్ణయించలేరని, పార్టీ అధిష్టానం నిర్దేశిస్తుందని తెలిపారు. జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ ఆహ్వానం పలుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ల శ్రీనివాస్, తొట్లరాజు యాదవ్, సందెల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నా
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి


