ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయ అభివృద్ధి

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

హన్మకొండ: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గణనీయ పురోగతి సాఽధిస్తున్నామని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ, డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు, జనరల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివిధ అంశాలను వివరించారు. టీజీ ఎన్పీడీసీఎల్‌లో వినియోగదారులకు విద్యుత్‌ సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వాట్సాప్‌ చాట్‌బాట్‌కు స్పందన లభిస్తోందని తెలిపారు. డి జిటల్‌ సేవల్లో భాగంగా ఫిర్యాదుల పరిష్కారంలో నూ పనితీరు మెరుగైందన్నారు. ఉద్యోగుల సేవల కు ఎంప్లాయ్‌ సపోర్ట్‌ బాట్‌ను అందుబాటులోకి తీ సుకొచ్చామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, సీఈలు కె.తిరుమల్‌ రావు, అశోక్‌, కె. వెంకటరమణ, సురేందర్‌, గౌతమ్‌ రెడ్డి, సీజీఎంలు చరణ్‌ దాస్‌, కిషన్‌, వేణుబాబు, జీఎంలు ప్రభావతి, శ్రీనివాస్‌, కళాధర్‌ రెడ్డి, జయరాజ్‌, వెంకట కృష్ణ, డి.ఈ. కె.అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement