బాలలకు ఆపదొస్తే ఎలా? | - | Sakshi
Sakshi News home page

బాలలకు ఆపదొస్తే ఎలా?

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

బాలలకు ఆపదొస్తే ఎలా?

సాక్షి, వరంగల్‌: చైల్డ్‌ హెల్ప్‌లైన్‌–1098కు వచ్చే ప్రతి కాల్‌ సాధారణ ఫోన్‌కాల్‌ కాదు.. అవతలి వైపు ఏడుస్తున్న బాలుడు, వేధింపులకు గురవుతున్న చిన్నారి, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లవాడు, బాలకార్మికుడు అయి ఉండొచ్చు. తక్షణ వైద్యం లేదా రక్షణ అవసరమైన వారు కావొచ్చు. అలాంటి సమయంలో కాల్‌ చేసిన వెంటనే స్పందన రాకపోతే ఆ నిమిషాల ఆలస్యం కూడా ప్రమాదకరమే. నిరంతరం సేవలు అందించాల్సిన 1098 ఆఫీస్‌కు తాళం పడితే బాలల రక్షణ వ్యవస్థకు అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరచూ ఫార్వర్డ్‌ కాల్‌ ఆప్షన్‌తో తమ వ్యక్తిగత మొబైల్‌ నంబర్లకు కాల్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంటూ రాత్రివేళ ఇంట్లో ఉంటున్నారని సమాచారం. దీనికి ఇక్కడ అధికారి ఒకరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈహెల్ప్‌లైన్‌కు సంబంధించిన వివరాలు అడిగితే గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

కలెక్టర్‌ ఆదేశాలు ఏమైనట్టు?

బాలల సంరక్షణ కోసం 2015 జేజే యాక్ట్‌ నిబంధనలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ ప్రకారం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నిరంతరం అందుబాటులో ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. 6 నెలల క్రితం బాలసముద్రంలోని బాలరక్షాభవన్‌ను వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద సందర్శించారు. ఎస్‌ఓపీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చైల్డ్‌లైన్‌ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవి పాటించడంలో సిబ్బంది వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్‌ ఆదేశాలనే అమలు చేయలేని పరిస్థితి ఉంటే.. బాలల రక్షణ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న యంత్రాంగం ఏం చేస్తోంది? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. భద్రతాపరంగా సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌ ఉన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మూడో అంతస్తుకు తరలించినా సాయంత్రం, రాత్రి వేళ హెల్ప్‌లైన్‌ సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సేవలు, 1098 కార్యాలయానికి తాళంపై జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణిని ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

రాత్రివేళ వరంగల్‌ చైల్డ్‌ హెల్ప్‌లైన్‌–1098 కార్యాలయానికి తాళం

ఆపదలో అండగా ఉండాల్సిన సిబ్బంది

విధులకు డుమ్మా

భద్రత పేరుతో ‘ఫార్వర్డ్‌ కాలింగ్‌’ వైపు మొగ్గు

కలెక్టర్‌ ఆదేశాలున్నా నిరంతర సేవలకు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement