ప్రతీ వ్యాపారి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ వ్యాపారి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

ప్రతీ వ్యాపారి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి

వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

హన్మకొండ: నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యంపై సెంట్రల్‌ జోన్‌ పోలీసుల ఆధ్వర్వంలో వరంగల్‌ మహానగరానికి చెందిన వ్యాపారస్తులకు హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్‌ సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతీ వ్యాపారస్తుడు తప్పనిసరిగా రోడ్డుపై దృశ్యాలు కనిపించేలా నాణ్యమైన ఒకటి, రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను త్వరగా హాస్పిటల్‌కు తరలించి వారి ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం రాహవీర్‌ పథకం కింద రూ.25 వేలు నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింగరావు, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, వ్యాపారులు పాల్గొన్నారు.

పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

కాజీపేట అర్బన్‌: కాజీపేట మండలం మడికొండలోని పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో శిక్షణార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులు, విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రమణబాబు, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఆర్‌ఐ సింహాచలం, శ్రీనివాస్‌, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మడికొండ పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం సీపీ శ్వేత పరిశీలించారు. పీఎస్‌లోని పలు రికార్డులు, అధికారుల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ప్రతీ ఫిర్యాదుకు రశీదు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement