కాశిబుగ్గ: కీటక జనిత వ్యాధులను నివారించాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి సూచించారు. వరంగల్ దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఎంహెచ్‌నగర్‌లో ఇటీవల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కీటక జనిత వ్యాధులపై గురువారం స్థానికులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డెంగీ, మలేరియాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి భరత్‌కుమార్, మాజీ కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమార స్వామి, హెచ్‌ఈఓ సదానందం, సూపర్‌వైజర్ మధుకర్ పాల్గొన్నారు.


