క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

వరంగల్‌ అర్బన్‌ : క్రీడలు శరీర దారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న అన్నారు. ఈనెల 18 నుంచి వరంగల్‌ బల్దియా ఇండోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, ఓఎంసీ సర్కిల్‌, తెలంగాణ ట్రాన్స్‌కో డిస్కం ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. ఇంటర్‌ సర్కిల్‌ బ్యాడ్మింటన్‌ (పురుషులు, మహిళలు), ఫుట్‌బాల్‌ (పురుషులు) టోర్నమెంట్‌ 2026–27 ముగింపు కార్యక్రమానికి కమిషనర్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ మురళీ సాగర్‌, ఎన్పీడీసీఎల్‌ జీఎం హేమంత్‌ కుమార్‌, ఎస్‌ఈలు రవీంద్ర, శ్రీనివాసులు, టీవీ రావు, ఎస్‌ఏఓ దేవేందర్‌ రెడ్డి, విద్యుత్‌ సౌధ స్పోర్ట్స్‌ అధికారి జగన్నాథ్‌, స్పోర్ట్స్‌ జనరల్‌ సెక్రటరీ రాజారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఓ రాజేశ్వర్‌ రావు, ప్రతినిధులు శ్యామ్‌, నరేశ్‌, వెంకటేష్‌, సృజన, తదితరులు పాల్గొన్నారు.

బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement