● అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: గడువులోగా భూ రీసర్వే కార్యక్రమాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేసేందుకు రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. గురువారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో సర్వేయర్లతో భూ రీసర్వేపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులను ప్రణాళికాబద్ధంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మొదటి దశలో ధర్మసాగర్ మండలం జానకీపురం, హసన్‌పర్తి మండలం ముచ్చర్ల, భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి, నడికూడ మండలం సర్వాపూర్ గ్రామాల్లో రీసర్వే పూర్తయినట్లు తెలిపారు. రాజుపేట, మాదన్నపేట గ్రామాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను మండలాల వారీగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.నూర్‌సింగ్ పాల్గొన్నారు.


