హసన్‌పర్తి : బతుకుదెరువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మరణించిన హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన వర్ణ భరత్ చందర్‌రెడ్డి మృతదేహం పదిరోజుల తర్వాత గురువారం గ్రామానికి చేరుకుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిని చూసిన స్థానికులు కూడా కంట తడిపెట్టారు. కాగా, భరత్ చందర్‌రెడ్డి పార్థివదేహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి తండ్రి సమ్మిరెడ్డి, చిన్నాన్న సుధాకర్‌రెడ్డిని ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే నాగరాజు నివాళి


