ఐడీ వార్డు.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

ఐడీ వార్డు.. ఆగమాగం

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

కాలకృత్యాలకు నీళ్లులేని దుస్థితి..

అధికారుల నియంత్రణ కరవు..

కాశిబుగ్గ : వరంగల్‌ మహాత్మాగాంధీ ఆస్పత్రిలో (ఎంజీఎం) ఐడీ (ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌) వార్డు అధ్వానంగా మారింది. వార్డు ఆవరణంతా అపరిశుభ్రం, అస్తవ్యస్తంగా తయారైంది. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. కనీసం కాల కృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్క నీరు లేదు. అయినా పట్టించుకునే వారే కరవయ్యారు. ఇదిలా ఉండగా పేషెంట్లను పరీక్షించేందుకు వైద్యులు రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా నామమాత్రంగా వైద్యసేవలు అందుతున్నట్లు తెలుస్తోంది.

పెషెంట్లను పట్టించుకోని సిబ్బంది..

ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డు, డైట్‌ సమీ పంలో ఐడీ వార్డును ఏర్పాటు చేశారు. అయితే దీని కి బయట మాత్రం మానసిక వార్డు అని బోర్డు పె ట్టి, లోపల ఐడీ వార్డు నడిపిస్తున్నారు. ఇందులో పలు రకాల వ్యాధులకు గురైన వారు చికిత్స పొందుతుంటారు. ఎక్కువగా ఆర్థో, న్యూరోకు సంబంధించిన పెషెంట్లు ఉంటారు. అలాగే, అనాథలుగా ఉ న్నవారిని కూడా ఈ వార్డులోనే ఉంచుతున్నారు. ఇ ంతవరకు బాగానే ఉన్నా.. వీరికి అంతంత మాత్ర మే వైద్యం అందుతోంది. అసలే ఏమి చేసుకోలేని దుస్థితిలో ఉన్న పేషెంట్లను నర్సింగ్‌ సిబ్బంది, స్వీ పర్లు చూడాల్సి ఉంది. అయితే వారిని పట్టించుకు న్న పాపాన పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు నెలల నుంచి పేషెంట్లను

పరీక్షించని వైద్యులు?

ఈ వార్డులో చికిత్స పొందుతున్న పది మంది పేషెంట్లను పరీక్షించడానికి రెండు నెలల నుంచి డాక్టర్లు వచ్చిన దాఖలాలు లేవని పలువురు రోగులు పేర్కొంటున్నారు. పేషెంట్లకు చికిత్స అందించ డం గాని, మందులు ఇవ్వడం గాని గాలికి వదిలా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్డు కు డాక్టర్లు సరిగా రారని తెలుస్తోంది. ఇక మందులు కూడా అడ్మిట్‌ అయిన మూడునాలుగు నెలల క్రి తం రాసినప్పటివే నర్సింగ్‌ సిబ్బంది ఇస్తుంటారని తెలిసింది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులను మార్చడానికి డాక్టర్లు రారని సమాచారం.

పేషెంట్లతో వార్డు శుభ్రం..

పేషెంట్లు పలుమార్లు వార్డును శుభ్రం చేసుకోవా ల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం ఓ పేషెంట్‌ వార్డును క్లీన్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఇందులో రోజు విధులు నిర్వహించే స్వీపర్లు ఎక్కడికి వెళ్లారో? ఎందుకు ఈ పని చేయిస్తున్నారో వారికే తెలియాలి. పేషెంట్ల భద్రత పేరుతో వార్డుకు ఎప్పుడు గొళ్లెం పెట్టి ఉండడం విమర్శలకు దారితీస్తుంది.

అధ్వానంగా మారిన ఎంజీఎంలోని ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌ వార్డు

రెండు నెలల నుంచి పేషెంట్లను పరీక్షించని వైద్యులు

మందులు మార్చకుండా అవే పంపిణీ చేస్తున్న వైనం

పేషెంట్లతోనే వార్డు శుభ్రం చేయిస్తున్న సిబ్బంది

కాలకృత్యాలకూ నీళ్లు కరువే

వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు నీళ్లు లేవు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్కనీరు లేకపోవడంతో వారు బాధలు వర్ణానాతీతం. సిబ్బందికి సైతం నీళ్లు లభించని పరిస్థితి నెలకొంది. వార్డు పైన ఉన్న పైపులను కోతులు విరగొట్టడంతో మరమ్మతు చేయక నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది.

ఎంజీఎంలోని పలు వార్డులపై నియంత్రణ కరవైంది. పాలన బాధ్యతలు మోస్తున్న అధికారులు అన్ని వార్డులను రౌండ్స్‌ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు ఆర్‌ఎంఓలు ఉన్నా.. మొదటి ఆర్‌ఎంఓ గత నెలలో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరూ రాలేదు. ఇద్దరు ఆర్‌ఎంఓల్లో దాదాపు ఒకరు సెలవుల్లో ఉంటే మిగిలింది ఒకరే. అతడే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఆస్పత్రి పనుల బట్టి గతంలో మాదిరిగా డిప్యూటీ సూపరింటెండెంట్‌తోపాటు అదనపు ఆర్‌ఎంఓలను నియమిస్తే రోగుల సమస్యలు కొంతవరకై నా తీరే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement