కాళోజీ సెంటర్: విద్యాశాఖ పనితీరు మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలను సా ధించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. డీఈఓ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. డీఈఓతో కలిసి సెక్టోరియల్ అధికారులు, ఆఫీస్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. పాఠశాల విద్యలో జిల్లా పనితీరును అంచనా వేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్‌ఫార్మెన్న్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) నివేదికలో జిల్లా ప్రచేస్త గ్రేడ్ 19వ స్థానంలో ఉందని, ప్రథమ స్థానం వచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు.


