● వరంగల్ డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డి
ఖిలా వరంగల్: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డి ఆదేశించారు. ఖిలా వరంగల్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌ఓ బుధవారం తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, ఓపీ రిజిస్టర్, ఫార్మసీ, ల్యాబ్‌లు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రిజిస్టర్లు, రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రజలకు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలను సమర్థవంతంగా అందించాలని, ఆ రోగ్య కేంద్రాల్లో ఓపీ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని, వారానికి రెండుసార్లు డ్రైడే నిర్వహించి దోమల వృద్ధి కేంద్రాలను నిర్మూలించాలని ఆదేశించారు. డాక్టర్ అనిత, డాక్టర్ వేద కిరణ్, ఎంపీహెచ్‌ఓలు సదానందం, నాగరాజు ఉన్నారు
ఎన్‌సీడీ లక్ష్యాలను సాధించాలి
గీసుకొండ: జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్‌సీడీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డి అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌సీడీ నర్సింగ్ ఆఫీసర్లు, నోడల్ పర్యవేక్షకులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎన్‌న్‌సీడీ జిల్లా కోఆర్డినేటర్లు ఆర్.ప్రకాశ్, ఎన్.శ్రీనివాస్ కర్ణ పాల్గొన్నారు.


