కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక
కేయూ క్యాంపస్: బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌లో ఈనెల 10నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య శనివారం తెలిపారు. పురుషుల జట్టులో ఎ.గౌతమ్, బి.రోషన్, డి.వివేక్‌చంద్ర, ఎస్.గోపీచంద్, సీహెచ్.వినయ్, ఆర్.అభినయ్, ఎం.అఖిల్, వి.గణేశ్ ఉన్నారు. మహిళా జట్టులో ఎ.మైథిలి, బి.శృతి, సీహెచ్.కీర్తన ఉన్నారు. జట్లకు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.సుమన్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, పీఆర్సీ సాధనే ఎజెండాగా త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నట్లు ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు రాజేందర్ తెలిపారు. శనివారం హనుమకొండలోని ఆ సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. 51శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ఏజెండాలే ప్రధానంగా కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఆలిండియా జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాను టీచర్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమునూరు రాంబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్.సాంబయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సూర రమేశ్, పూర్వ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఆట సదయ్య, రాష్ట్ర బాధ్యులు ఆర్.సుధాకర్‌రెడ్డి, మాలోతు గణపతి, వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధులిమాయె, దానం నాగరాజు, హనుమకొండ జిల్లా ఆర్థిక కార్యదర్శి దానం శివకోటి తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: పీడీఎస్‌యూ వరంగల్–హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని శని వారం ఎన్నుకున్నారు. 23మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ శనివారం తెలిపా రు. వరంగల్–హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బి.అజయ్, ప్రధాన కార్యదర్శిగా బి.నర్సింహారావు, ఉపాధ్యక్షులుగా పి.అనూష, బి.బాలకృష్ణ, గణేశ్, సహాయ కార్యదర్శులుగా అలువా ల నరేశ్, వి.కావ్య, వంశీ, సంగీత, కోశాఽధికారిగా షరీఫా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు.
విద్యారణ్యపురి: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయడమే కాకుండా, సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలను సమాజపు లోతుల్ని స్పృశించిన కవి వీఆర్ విద్యార్థి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో కేయూ విశ్రాంత ప్రొఫెసర్ బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన వీఆర్ విద్యార్థి రచించిన కాలపుష్ఫం గ్రంథాన్ని నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, సాహితీవేత్తలు, రచయితలు గిరిజామనోహర్‌బాబు, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, లింగాల జగన్‌రెడ్డి, శివరామప్రసాద్, పందిళ్ల అశోక్‌కుమార్, వీఆర్ విద్యార్థి కుమారులు ప్రవాస భారతీయులు అమర్, శైలేంద్ర మాట్లాడారు. వీఆర్ విద్యార్థి అశీతి (80 ఏళ్ల పుట్టిన రోజు) సందర్భంగా విద్యార్థి దంపతులను అతిథులు తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎన్‌వీఎన్ చారి, ఆగపాటి రాజ్‌కుమార్, ఉపాధ్యాయుడు వల్సపైడి పాల్గొన్నారు.
అజయ్ అధ్యక్షుడు, నర్సింహారావు ప్రధాన కార్యదర్శి
కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక
కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక
కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక


