హన్మకొండ కల్చరల్: హనుమకొండకు చెందిన కవయిత్రి, కథా రచయిత, గజల్ రచయిత, గాయని గంపిటి అరుణకీర్తి పతాకరెడ్డిని గజల్ సాహితీ వేదిక బాధ్యులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, గజల్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో కొరుప్రోజు మాధవరావు రచించిన గజల్ కావ్యమాలిక అలకనంద పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గజల్ కచేరీలో గజల్ సాహితి సంస్థ అధ్యక్షుడు ఇరువైంటి శర్మ, సుప్రీ కోర్టు జడ్జి నేరెళ్ల మాల్యాద్రి, గజల్ గాయకుడు రసవిహారి తిరుపతిరెడ్డి తదితరులతో కలిసి అరుణ కీర్తిపతాకరెడ్డి పాల్గొని గజల్ వినిపించారు. కార్యక్రమం అనంతరం అరుణ కీర్తిపతాకరెడ్డిని సన్మానించి మెమోంటోతో పాటు అలకనంద పుస్తకాన్ని అందజేశారు.