
నన్స్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
కాజీపేట: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నన్స్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఫాతిమానగర్ కేథడ్రల్ చర్చి ఆవరణ నుంచి మదర్ థెరిస్సా విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నన్స్‌పై పెట్టిన కేసులను భేషరత్‌గా ఉపసంహారించుకోవాలని నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకుండే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫాదర్ విజైపాల్, బొక్క దయాసాగర్, సిస్టర్ కల్పన, ఆర్.రాజ్‌మోహన్ రావు, ఫాదర్ కాసు మర్రెడ్డి, ఫాదర్ తాటికొండ జోషఫ్, టీడీ టామి తదితరులు పాల్గొన్నారు.