
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
హసన్‌పర్తి: అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. రెండో డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లో బాలవికాస సంస్థ సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉన్నట్లయితే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం 80961 07107 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎనీ టైమ్ వాటర్ కార్డులను కాలనీవాసులకు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవినాయక్, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, బాలవికాస సంస్థ డైరెక్టర్ శౌరెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, కొంక హరిబాబు, నాయకులు కుక్క తిరుపతి, మాదాసి అజయ్, కాలనీవాసులు కృష్ణ, రవికుమార్, తారమ్మ పాల్గొన్నారు.