
మహ్మద్ ఇబ్రహీం సేవలు మరువలేనివి
న్యూశాయంపేట: ముస్లిం సమాజానికి ఇబ్రహీం చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పూర్వ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం ఇటీవల అమెరికాలో మృతిచెందారు. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సంతాప సభలో నగరానికి చెందిన పలువురు హాజరై ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉంటూ విద్యా, వైద్యం, సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో మౌలానా ఫసియొద్దీన్ ఖాస్మి, రిటైర్ట్ తహసీల్దార్ ఖమరుజ్జామా, సిరాజ్ అహ్మద్, ఎంఏ.కలీం, యూసుపొద్దీన్, హమీదుద్దీన్, నాసిర్‌వాహిదీ, నయీమొద్దీన్, అన్వర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.