
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
● ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్
రామన్నపేట: కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను తొలగిస్తూ నాలుగు లేబర్ కోడ్స్‌లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్, ఆలిండియా కార్మిక సంఘం నాయకుడు గొర్రె కుమారస్వామి డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి హక్కులు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారపు రమేష్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, సాగర్, కన్న వెంకన్న, మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, రత్నం, రామస్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.