
రేపటినుంచి రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్
హసన్‌పర్తి: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్–2025 పోటీలు ఈ నెల 31వ తేదీనుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ మామునూరు వేదికగా ఉదయం 9గంటలకు ఉన్నతాఽధికారుల చేతుల మీదుగా పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో రాష్ట్రంలోని ఏడు పోలీస్ జోన్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, యాంటీనార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ, జీఆర్‌పీ, అక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు వేయిమంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నట్లు వివరించారు. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, మీడియాగ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 2న తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు చాంపియన్ షిప్ ట్రోఫీ కూడాఅందజేయనున్నట్లు సీపీ వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్