
34 రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు.
పొడిగింపు రైళ్ల వివరాలు..
ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్‌లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు.
హాల్టింగ్ స్టేషన్లు..
కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్ అండ్ డౌన్ రూట్‌లో ప్రయాణించే రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమ్, కోడేమా, గయా, జెహన్‌బాద్ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ల సౌకర్యం కల్పించారు.