
నైపుణ్యాలతోనే శాఖాపరమైన గుర్తింపు
ఖిలా వరంగల్: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్‌తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు.
ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు..
రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్, వీడియో గ్రఫీ, సైంటిఫిక్ ఎయిడ్ విభాగాల్లో పోటీలు జరిగాయి.
మోహన్ కృష్ణకు బంగారు పతకం..
రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్‌ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.
ఆటా..పాట
డ్యూటీమీట్‌లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు.
పోటీలతో మానసిక ఒత్తిడి దూరం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్

నైపుణ్యాలతోనే శాఖాపరమైన గుర్తింపు