నేడు జిల్లాస్థాయి జూడో పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాస్థాయి జూడో పోటీలు

Jul 30 2025 6:36 AM | Updated on Jul 30 2025 6:36 AM

నేడు

నేడు జిల్లాస్థాయి జూడో పోటీలు

రామన్నపేట: సబ్‌జూనియర్‌, క్యాడెట్‌ విభాగా ల్లో బాలబాలికలకు బుధవారం వరంగల్‌ జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించనున్న ట్లు తెలంగాణ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్‌యాదవ్‌ ఒక ప్రకటన లో తెలిపారు. వరంగల్‌లోని కెమిస్ట్‌ భవన్‌లో నిర్వహించే ఈ పోటీలకు సబ్‌ జూనియర్స్‌ విభాగంలో పాల్గొనే బాలబాలికలు 2011–2013 సంవత్సరం, క్యాడెట్‌ విభాగంలో పాల్గొనే బాలబాలికలు 2008–2010 సంవత్సరం మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నా రు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పకుండా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు ఒరిజి నల్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

‘ఇరిగేషన్‌ అధికారిపై

చర్య తీసుకోవాలి’

హన్మకొండ అర్బన్‌: ఇరిగేషన్‌ శాఖలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై సత్వరమే శాఖాపరమైన చర్య తీసుకోవాలని టీఎన్జీవోస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌ ఒక ప్రకటనలో కోరారు. రిటైర్మెంట్‌ ముందు తనను ఎవరు ఏం చేయలేరని వరంగల్‌ ఇరిగేషన్‌ శాఖలో పనిచేసే సదరు అధికారి అనేక అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌ పదోన్నతి విషయం కోర్టు, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. పట్టించుకోకుండా అడ్డదారిలో అనర్హులకు పదోన్నతి ఇవ్వడంతో అర్హులు సీనియార్టీ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంట్రాక్ట్‌ పనులు, రీ ఎస్టిమేషన్లు, టెక్స్‌టైల్‌ పార్కు నిధుల గోల్‌మాల్‌, మిడ్‌మానేరు పనుల్లో అవకతవకలపై విజిలెన్స్‌ ఎంకై ్వరీ వంటి పలు ఆరోపణలపై కథనాలు వెలువడ్డాయని తెలిపారు. వెంటనే ఈ విషయాలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించి, సంబంధిత ఫైల్స్‌ను సీజ్‌ చేసి అక్రమాలకు పాల్పడిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక విద్యాబోధన

చేయాలి : డీఈఓ

విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక విద్యాబోధన చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. జిల్లాలోని 18 సమ్మిళిత విద్యా రిసోర్స్‌పర్సన్లు, 10 మంది ప్రత్యేక ఉపాధ్యాయులతో సమ్మిళిత విద్యపై డీఈఓ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలు ఎంతమంది ఉన్నారో సర్వే పూర్తిచేయాలని సూచించారు. విద్యార్థుల మానసికస్థాయిని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయించాలని, వారిని భవిత కేంద్రాల్లో ఉంచి సాధారణ విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, కృత్యపుస్తకాలు అందించాలని సూచించారు. భవిత కేంద్రాలకు రాలేని వారికి ఇళ్ల వద్దనే ప్రతి శనివారం విద్యనందించాలని, అవసరమైన పిల్లలకు ఫిజియోథెరపీ చేయించాలని, ప్రొఫైల్‌ కూడా రూపొందించాలన్నారు. కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కోఆర్డినేటర్‌ బద్దం సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘మాస్ట్రియో’పై

120 ట్రాఫిక్‌ చలాన్లు

కాజీపేట: వరంగల్‌ నగరంలోని కాజీ పేట డీ–మార్ట్‌ ఎ దురుగా మంగళవా రం ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టగా ఒకే వాహనంపై 120 ఈ–చలాన్లు, రూ.32,165 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని ట్రాఫిక్‌ సీఐ వెంకన్న తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 36 ఏఎక్స్‌ 4930 నంబర్‌ గల మాస్ట్రియో ద్విచక్ర వాహనం ఆపి ఈ–చలాన్‌ చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పది కాదు.. ఇరవై కాదు ఏకంగా 120 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ వెంకన్న తెలిపారు.

ట్రైనింగ్‌ సర్వేయర్లకు

ప్రాక్టికల్‌ పరీక్షలు

ఖిలా వరంగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో 45రోజులుగా శిక్షణ పొందుతున్న భూ సర్వేయర్‌ అభ్యర్థులకు మంగళవారం ఖిలా వరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌, హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగాయి. భూమిని కొలతలు వేసి నిర్ధారించేలా పరీక్షలు నిర్వహించారు. వరంగల్‌ ఏడీ దేవరాజు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నేడు జిల్లాస్థాయి  జూడో పోటీలు1
1/1

నేడు జిల్లాస్థాయి జూడో పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement