
ప్లాస్టిక్ రహిత మార్కెట్‌గా తీర్చిదిద్దాలి
హన్మకొండ: హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని రైతుబజార్‌ను ప్లాస్టిక్ రహిత మార్కెట్‌గా తీర్చిదిద్దాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులు, వ్యాపారులకు సూచించారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం 59వ డివిజన్ పరిధి హనుమకొండ కనకదుర్గ కాలనీ, ఎకై ్సజ్ కాలనీలో కార్పొరేటర్ గుజ్జుల వసంతతో కలిసి కమిషనర్ పర్యటించారు. పార్కులు, డ్రెయినేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేబుల్ సంచులు వినియోగించాలని సూచించారు. వీధుల్లో చెత్త కనిపిస్తే జవాన్లకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. పార్కుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. వంద శాతం పారిశుద్ధ్య సిబ్బంది హాజరు కావాలని, ఈ దిశగా శానిటరీ ఇన్స్‌పెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. నిర్మాణ సంబంధ వ్యర్థాలను తొలగించని యాజమాన్యాలకు జరిమానా విధించని జవాన్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎకై ్సజ్ కాలనీలోని ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ గోపాల్‌రావు, డీఈ సారంగం, ఉద్యాన అధికారి రమేశ్, ఏఈ మేనక, వర్క్‌ఇన్‌స్పెక్టర్ రవికుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్‌రెడ్డి, రాజీవ్ పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జవాన్లు సతీశ్, మహేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
చెత్త కనిపిస్తే జవాన్లకు జరిమానా
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్