
రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి
మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: రికార్డుల నిర్వహణను మెరుగుపరచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల గదిని పరిశీలించి మాట్లాడారు. ఫైళ్లపై పేరుకుపోయిన దుమ్ముధూళిని శానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేయించి, ర్యాకుల్లో వరుస క్రమంలో అమర్చాలని సూచించారు. సర్కిల్ కార్యాలయంలో పేరుకుపోయిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. కార్యాలయంలో దెబ్బతిన్న పలు అంతస్తులను గమనించి మరమ్మతులు చేయించాలని చెప్పారు. అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేయాలని, కార్యాలయం ముందు భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈ శ్రీనివాస్ ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఏసీపీలు ఖలీల్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఓలు శ్రీనివాస్, షహజాదీ బేగం పాల్గొన్నారు.