
అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ చిక్కాడు
హసన్‌పర్తి: టాస్క్‌ఫోర్స్, ఆర్పీఎఫ్ నుంచి తప్పించుకున్న ఓ గంజాయి వ్యాపారి.. చివరికి హసన్‌పర్తి పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు హసన్‌పర్తి పీఎస్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లించారు. ఒడిశాలోని మోహన తాలూకాకు చెందిన ఆశీష్ కుమార్ దిన సరికూలీ. వచ్చిన సంపాదనతో కుటుంబ పోషణ భారంగా మారడంతో సులుభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశాలోని చాందిపుల్‌కు చెందిన జమీర్ నుంచి ఈనెల 25న 30 కిలోల బ్రౌన్ గంజాయి కొనుగోలు చేసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్రకు బయలుదేరాడు. 26న రైలు వరంగల్‌కు చేరుకుంది. అయితే అదే సమయంలో ఇటు ఆర్పీఎఫ్, అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైలులో తనిఖీలు చేస్తుండడం గమనించిన ఆశీష్‌కుమార్.. వారి నుంచి తప్పించుకుని కాలినడకన హసన్‌పర్తి చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ఎక్కడానికి ఎల్లాపురం స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో చిక్కగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. పట్టకున్న గంజాయి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు, సబ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్,సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
గంజాయి వ్యసనంతో కుటుంబాలు ఆగం..
గంజాయి వ్యసనంతో కుటుంబాలు ఆగమవుతున్నాయని ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. విద్యార్థులు, వలస కూలీలు ఎక్కువ గంజాయి బారిన పడుతున్నారన్నారు. వీటిపై కళాశాలల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి వ్యాపారి అరెస్ట్, రిమాండ్
రూ.15లక్షల విలువైన సరుకు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి