
అర్జీలు త్వరగా పరిష్కరించండి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 152 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువ మొత్తంలో రెవెన్యూ 60, హౌసింగ్ 28, దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, అగ్రికల్చర్ అధికారి అనురాధ, డీపీఓ కల్పన, డీసీఓ నీరజ, ఏఓ విశ్వప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.