
వాగు దాటించి.. వైద్యం అందించి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం నర్సాపూర్ వాగు మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం మండలంలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో ఆశ వర్కర్ కొడిశాల పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌కు సమాచారం అందించారు. దీంతో పవన్.. హెల్త్ సూపర్‌వైజర్ బాలు, హెల్త్ అసిస్టెంట్ సీతారాంనాయక్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు వెంటనే గ్రామస్తుల సాయంతో నడుంలోతు వరద నుంచి కృష్ణవేణిని ఎత్తుకుని వాగు దాటించారు. అనంతరం ట్రాక్టర్‌లో పోచాపూర్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. కాగా, సకాలంలో అప్రమతమై స్పందించి గర్భిణి కృష్ణవేణిని వాగు దాటించిన వైద్యాధికారులు, సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
గర్భిణిని వాగు దాటించి ఆస్పత్రికి
తరలించిన వైద్యసిబ్బంది