
భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మనుగొండ, సంగెం మండలం సంగెం గ్రామాల భూ నిర్వాసితులకు అవార్డ్ పాస్ చేసేందుకు వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన బుధవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్‌కుమార్, నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్‌డీసీ
న్యూశాయంపేట: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ)గా పదోన్నతి పొందిన వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్