
సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలు
25 నుంచి రాష్ట్ర స్థాయి
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా వేదికగా మూడు రోజులు జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ (అండర్–17) బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మూల జితేందర్‌రెడ్డి, డాక్టర్ కొమ్ము రాజేందర్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాంపియన్‌షిప్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు వరంగల్ క్లబ్, భీమారంలోని కిట్స్ కళాశాల ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు జరగనున్న పోటీలకు ముందు నేడు(గురువారం) క్రీడాకారులకు క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా మెయిన్ జట్లలోకి తీసుకుంటామన్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీల్లో జరిగే పోటీలకు తెలంగాణలోని 20 జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. వరంగల్ క్లబ్‌లో 25న జరిగే పోటీలను వరంగల్ పోలీస్ కమీషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించున్నట్లు వెల్లడించారు. 27వ తేదీన నిర్వహించే ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి , గౌరవ అతిథులుగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మాస్టర్స్ ఇంటర్నేషనల్ క్రీడాకారుడు శశిధర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. సమావేశంలో వరంగల్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పింగిళి రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేడు క్వాలిఫైయింగ్ రౌండ్స్
20 జిల్లాల నుంచి
190 మంది క్రీడాకారులు..