
రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
హన్మకొండ: రెవెన్యూ వసూళ్లు, బకాయిలపై నోడల్ జనరల్ మేనేజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు చెల్లించని సర్వీసులపై దృష్టి సారించి వాటిని రాబట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీసీ ఐపాస్ సర్వీసుల రిలీజ్ వేగవంతం చేయాలన్నారు. కొత్త సబ్ స్టేషన్ పనులను విధిగా తనిఖీలు చేపట్టాలన్నారు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు, ఫాల్ట్ ప్యాసేజీ ఇండికేటర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. భారీవర్షాల నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని, ఎక్కడ అంతరాయాలు ఏర్పడినా వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, వి. మోహన్ రావు, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి