
ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం..
ధర్మసాగర్: దే వాదుల ఎత్తిపోతల పథకం ద్వా రా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీ రందిస్తామని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పంట పొ లాలకు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ కింద 12 డిస్ట్రిబ్యూటరీల ద్వారా 1.6 లక్షల ఎకరాలకు నీరందనున్నట్లు తెలిపారు. ఈకెనాల్ ద్వా రా ధర్మసాగర్, ఐనవోలు, జఫర్‌గఢ్, హసన్‌పర్తి మండలాలకు సాగు నీరందనున్నట్లు పేర్కొన్నారు. ఈఏడాది తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాలేదన్నారు. రైతులు నార్లు పోసుకుని వర్షం కోసం ఎదురు చూస్తున్నారని, నాట్లు వేసుకునేందుకు సాగు నీరు అందించడానికి నీటిని విడుదల చెసినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, పంటల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటలను కాపాడేందుకు ఆన్, ఆఫ్ పద్ధతిలో పది రోజుల పాటు నీటిని విడుదల చేసి మరో పది రోజులు నీటి విడుదల ఆపనున్నట్లు వెల్లడించారు. ఇలా పంటలకు సాగు నీరందిస్తామని ఇందుకు రైతులు సహకరించాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.