
నిధుల మంజూరుకు కృషి
హసన్‌పర్తి: కార్పొరేషన్ ద్వారా విడుదలవుతున్న నిధుల నుంచి 1/3 శాతం బడ్జెట్‌ను విలీన గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. 2వ డివిజన్ గుండ్లసింగారంలోని బంజారా, పోలీస్ కాలనీల్లో రూ.40 లక్షల వ్యయంతో చేపడుతున్న మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనమై 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పట్టణ వాతావరణం కనిపించట్లేదన్నారు. విలీన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవినాయక్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, పీఏసీఎస్ చైర్మన్ మేర్గు రాజేశ్, గోపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, మాజీ వైస్ ఎంపీపీ పోలం అనిల్‌రెడ్డి, కాంగ్రెస్ హనుమకొండ మండల అధ్యక్షుడు మాదాసి అజయ్, సోషల్ మీడియా కో–ఆర్డి నేటర్ పుట్ట తిరుపతి తదితరులున్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు