ఆపరేషన్లలో దిట్ట.. | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్లలో దిట్ట..

Jun 19 2025 3:50 AM | Updated on Jun 19 2025 3:50 AM

ఆపరేషన్లలో దిట్ట..

ఆపరేషన్లలో దిట్ట..

గాజర్ల రవి 1985–1986లో వరంగల్‌లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్‌ యూనియన్‌లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్‌ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్‌ నిర్వహిస్తే ఫెయిల్‌ కాదన్న అభిప్రాయం ఉంది.

● 1994లో ప్రస్తుత జయశంకర్‌ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్‌మైన్‌ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు.

● 2001లో ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు.

● 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement