
పకడ్బందీగా ఎల్‌ఆర్‌ఎస్ అమలు
వరంగల్: వరంగల్ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్‌ఆర్‌ఎస్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 41,754 దరఖాస్తులు రాగా.. 24, 699 దరఖాస్తులకు మంజూరు చేశామని చెప్పారు. 5,787 మంది రూ.107.61 కోట్ల ఫీజులు చెల్లించగా.. 382 మందికి ప్రొసీడింగ్‌లు అందజేశామని పేర్కొన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఏఓ అనురాధ, డీటీసీపీ జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.