
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
● 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు
హన్మకొండ: సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. హనుమకొండ జిల్లా పరకాల సీఎస్‌ఐ 1984–1985 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆది వారం హనుమకొండ 100 ఫీట్ల రోడ్‌లోని వెంకటేశ్వరకాలనీలో కలుసుకున్నారు. 40సంవత్సరాల తర్వా త కలుసుకున్న వారు ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకున్నారు. పదో తరగతి తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు. అనంతరం ఉద్యోగాలు, వాప్యారాలు చేస్తూ బిజీగా గడుపుతూ ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు.. 40ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకుని పాఠశాల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆనాడు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు నరసింహ రామయ్య, పీఈటీ జేమ్స్, డి.కోర్నేల్, ఫౌల్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.