గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 23 2026 1:46 AM | Updated on Jun 23 2026 1:46 AM

మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026 పంట భూముల్లో మళ్లీ క్వారీయింగ్‌ నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం మండలాలకు బ్యాగులు పంపాం నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం ● ఏవైనా భూముల్లో క్వారీ మట్టి తవ్వటానికి అనుమతి కావాలంటే తొలుత ఆ భూమి ఖాళీదేనని రెవెన్యూ శాఖ సర్టిఫై చేయాలి. ఆ తర్వాత మైనింగ్‌శాఖ అనుమతిస్తుంది. లైసెన్సునిచ్చి, వే బిల్లులు అందజేస్తారు. మైనింగ్‌శాఖ నిబంధనలను ఖచ్ఛితంగా పాటించకపోతే లైసెన్సును రద్దుచేసే అధికారం ఉంటుంది. ఇక్కడ మాత్రం నిబంధనలు ఏమాత్రం పాటించటం లేదు. ● కొలకలూరు–అనుమర్లపూడి గ్రామాల మధ్య ప్రస్తుతం క్వారీయింగ్‌ జరుగుతున్న పంటపొలంలో 0.223 హెక్టార్లలోనే తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. అంటే కేవలం 55 సెంట్ల విస్తీర్ణంలోనే తవ్వకాలు జరగాలి. దాదాపు ఎకరంపైగా విస్తీర్ణంలోనే తవ్వేశారు. దాదాపు ఆరు గజాల లోతుకు మించి తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉంది. కానీ తాటిచెట్టుకు పైగా నిలువులో క్వారీని తవ్వేస్తుంటే అధికారులు పట్టీపట్టనట్టు లేదంటున్నారు. ● సమీప రైతుల పంటపొలాలకు కొన్ని గజాల దూరంలో మాత్రమే తవ్వకాలు చేయాలనే నిబంధననూ లీజుదారుడు బేఖాతరు చేశారు. సమీప పొలం గట్టు అంచులవరకు తవ్వేశారు. ఇక వే బిల్లుల భాగోతం తెలియంది కాదు... తెచ్చుకున్న వే బిల్లులకు రవాణా చేసే ట్రాక్టర్ల సంఖ్యకు కొన్ని రెట్లు అధికంగా ఉండటం తెలిసిందే. ఒక్కో వే బిల్లుతో అయిదేసి, పదేసి ట్రాక్టర్లను రవాణా చేస్తుంటారనే ఆరోపణలు అన్నిచోట్లా ఉన్నవే. టీడీపీదే పాపం ఆ భూములు బంగారం

న్యూస్‌రీల్‌

2014–19లో అనుమతించిన చంద్రబాబు సర్కారు తవ్వకాల్లో అక్రమాలు ‘మామూలే’ పట్టించుకోని అధికారులు నాడు తీసిన గోతుల్లో పడి మునిగి ఈనెల 21న బాలుడు మృతి

మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026
పంట భూముల్లో మళ్లీ క్వారీయింగ్‌

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4200, మోడల్‌ ధర రూ.3600 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.3600 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 515.70 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త వి.పద్మావతి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లను అరకొరగా పంపిణీ చేస్తున్న విషయమై సోమవారం ‘ఇదేమీ బ్యాగులేదు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త వి.పద్మావతి స్పందించారు. పాఠశాలలు తెరిచి 10 రోజులు గడిచినా ఒక్క విద్యార్థికి సైతం బ్యాగులను అందజేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను సమగ్ర వివరాలతో అందించిన కథనంపై స్పందించిన ఏపీసీ జిల్లాలో ఇప్పటివరకూ పంపిణీ జరిగిన తీరును వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,187 మంది విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటివరకు 63,220 బ్యాగులు వచ్చాయని, వాటిని 11 మండలాలకు పంపినట్లు తెలిపారు. మిగిలిన సామగ్రి సైతం మండలాలకు పంపుతామని పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్‌బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.

తెనాలి: తెనాలి రూరల్‌ మండల గ్రామం అనుమర్లపూడికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఖిల్‌ ఆదివారం కొలకలూరు – అనుమర్లపూడి గ్రామాల మధ్య గల క్వారీ చెరువులో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు క్వారీయింగ్‌ చేసిన ప్రాంతమది. నిబంధనలకు పాతరేసి తవ్వేసిన పంటపొలం ఇప్పుడు లోతెంతో తెలియని చెరువుగా మారింది. అదే ఇప్పుడు మృత్యుకుహరంగా మారి తొమ్మిదో తరగతి చదువుతున్న నిఖిల్‌ను బలితీసుకుంది.

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

అక్కడకు సమీపంలోనే మళ్లీ ఓ రైతు పంటపొలంలో క్వారీయింగ్‌కు చంద్రబాబు సర్కార్‌ అనుమతించింది. కొలకలూరుకు చెందిన రైతు పొలంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెనిగళ్ల గోపీకృష్ణకు అయిదేళ్లకు అనుమతించింది. పొక్లెయిన్లతో నిత్యం రబ్బిష్‌ తవ్వేస్తూ, అమ్మకాలు సాగిస్తున్నారు. అనుమతించారు సరే...నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు ‘మామూలు’గానే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీనితో తవ్వకం లీజుదారుడి ఇష్టారాజ్యమైంది.

గతంలో నలుగురు కూలీలు మృత్యువాత...

క్వారీలో భారీ గోతులు తవ్వి మట్టి తీస్తుండటంతో సమీప పొలాల రైతులు కూడా తమ పంటపొలం గట్లు విరిగిపడతాయనే భయంతో ఆ పొలాలను కూడా క్వారీయింగ్‌కే అనివార్యంగా అమ్మాల్సి వస్తోంది. ఇదే ఆసరాగా క్వారీ నిర్వాహకులు లాభాల పంట పండించుకుంటున్నారు. ఎటా కొంత భూమిని కొనటం, మట్టిని తోడేయటం కొనసాగించారు. కాలం మారినట్టే కూలీఈల స్థానంలో యంత్రాలు ప్రవేశించాయి. 1997–98లో క్వారీ తవ్వకాల్లో మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఇక అప్పట్నుంచి మొత్తం యంత్రాలనే వినియోగిస్తున్నారు.

తాటిచెట్టు ఎత్తుకు పైగా తీస్తున్న గోతుల కారణంగా అక్కడ వర్షపునీరు నిలిచి చెరువుల్లా మారుతున్నాయి. ఎక్కడెంత లోతుందో తెలియని పరిస్థితి. అలా 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు తవ్వకాలు చేసిన క్వారీలోనే అనమర్తపూడికి చెందిన బాలుడు నిఖిల్‌ మృత్యువాత పడ్డాడు. ఇప్పటికై నా అధికారులు నిబంధనల కొరడా తీస్తారా? లేదా? అనేది చూడాల్సివుంది.

కొలకలూరు గ్రామంలో దక్షిణంపైవు అనమర్లపూడి వెళ్లే రోడ్డులో పంటభూములు గరప నేలలు. నీటిసౌకర్యం లేని పూర్వకాలంలో ఎకరా రూ.7 వేలకు మించేది కాదు. కాలక్రమంలో బోర్లు వేసుకోవటంతో సాగునీటి వసతి లభించింది. వరితో సహా వేరుశెనగ పంటలను సాగుచేయటం ఆరంభించారు. అదే సమయంలో అక్కడి భూముల్లోని ప్రత్యేకతపై కొందరి కన్ను పడింది. పై లేయరు ఇసుక, తర్వాత ఎర్రమట్టి, మూడో లేయరుగా రబ్బిష్‌, నాలుగో లేయరుగా చట్టు లభ్యమవుతుంది. వాటిని తవ్వేసి విక్రయించుకుంటే పంటలను మించి లాభాల పంట పండుతుందని భావించారు. ప్రారంభంలో ఒక రైతుకు చెందిన కొంత భూమిని కొనుగోలు చేసి మట్టితవ్వకం చేశారు. లాభాలు రావడంతో మరికొందరు రంగప్రవేశం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement