గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఏదైనా అర్జీ నిర్దేశించిన గడువు దాటితే ఆయా శాఖల అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కలెక్టర్ స్వయంగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వచ్చిన 347 అర్జీలను కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, గంగరాజు, జిల్లా అధికారుల స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


