లక్ష్మీపురం: కేర్ దంత వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సులను 2026 సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు కేర్ విద్య, వైద్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్ తెలిపారు. గుంటూరు పొత్తూరులోని కేర్ డెంటల్ కళాశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్ షేక్ హాజరయ్యారు. సయ్యద్ రసూల్ మాట్లాడుతూ జాతీయ దంత వైద్య కమిషన్ గుర్తింపు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతులతో దంత వైద్య విద్యలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చేరిందన్నారు. కళాశాల డైరెక్టర్ మీర్ రహమత్ మొహీయుద్దీన్, ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ కేర్ డెంట్ కళాశాల ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికత, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో కూడిన మా సంస్థ దేశంలోని ప్రముఖ దంత వైద్య, విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పీజీ డీన్‌గా డాక్టర్ మెహబూబ్ షేక్‌కు పదోన్నతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
సంస్థ వ్యవస్థాపక చైర్మన్
డాక్టర్ సయ్యద్ రసూల్


