రూ.3 వేల కోసం ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.3 వేల కోసం ఇక్కట్లు

Jun 23 2026 1:46 AM | Updated on Jun 23 2026 1:46 AM

రూ.3 వేల కోసం ఇక్కట్లు

పాతగుంటూరుకి చెందిన ఓ ఆటో యాజమాని వద్ద అద్దెకు ఆటో తీసుకునే వాడిని. అతనికి ఆటో అద్దె రూ.5 వేలు చెల్లించాలి. నా మొబైల్‌ఫోన్‌ను ఆటో యాజమాని వేరోక వ్యక్తి వద్ద తనఖా పెట్టించి రూ.2 వేలు తీసేసుకున్నాడు. రూ.3 వేలు బాకీ చెల్లిస్తానని యాజమానికి చెప్పగా, అప్పటికే నాపై స్థానిక పోలీస్‌స్టేషన్‌(పీఎస్‌)లో ఫిర్యాదు చేశాడు. ఈలోగా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. భార్య నిండు గర్భిణి అని చెప్పిన అలకించలేదు. రాత్రి వరకు లాకప్‌లోనే ఉంచారు. ఈలోగా స్టేషన్‌ పోలీస్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, ఆటో యాజమాని వైపు మాట్లాడారు. అయితే 15 రోజుల్లో బాకీ చెల్లిస్తానని యాజమానితో ఒప్పందం చేసుకున్నా. ఈనెల 12న భార్య జీజీహెచ్‌లో మగ శిశువుని ప్రసవించగా, డబ్బులు చెల్లించలేకపోయా. ఇక రూ.3 వేల కోసం ఇటీవల కానిస్టేబుల్‌, యాజమాని సంగడిగుంటలోని అద్దె ఇంటి వద్దకు వచ్చి హడావుడి చేశారు. దీంతో ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యాజమాని చెప్పగ్గా, ప్రస్తుతం చుట్టుగుంటలో అద్దెకు ఉంటున్నా. అయినా పోలీసులు, యాజమాని నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. భార్య ప్రసవించగా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది. త్వరలో బాకీ చెల్లిస్తాను. న్యాయం చేయగలరు.

– ఎం.నాగార్జున, భవానీ, చుట్టుగుంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement