హర హర మహాదేవ.. | - | Sakshi
Sakshi News home page

హర హర మహాదేవ..

Feb 16 2026 7:21 AM | Updated on Feb 16 2026 7:21 AM

హర హర

హర హర మహాదేవ..

క్వారీలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఇస్టానుసారంగా వీఐపీ పాసులు పంపిణీ సామాన్య భక్తులకు ఇక్కట్లు

క్వారీలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

క్యారీలో విద్యుత్‌ ప్రభల వెలుగులు

చేబ్రోలు: హర హర మహదేవా శంభో శంకర.. చేదుకో కోటయ్యా ... అంటూ శివనామస్మరణతో మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి మారుమోగింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం వద్దకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పండుగ సందర్బంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరునాళ్ల సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలతో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు సుమారు 15 వరకు భారీ విద్యుత్‌ ప్రభలను నిర్మించారు. దేవాలయం ప్రాంగణం వద్ద వంద అడుగుల పైన ఉన్న భారీ సెట్టింగ్‌ విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. చేబ్రోలు, తెనాలి పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో చిన్నచిన్న ప్రభలు, బాల ప్రభలు, మొక్కుబడు ప్రభలు తరలివచ్చాయి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలలో భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు భక్తులు క్యూలైన్లతోపాటు బయట వరకు బారులు తీరారు. గంటల తరబడి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కులు తీర్చుకోవటం కోసం మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో పొంగళ్లు పొంగించుకున్నారు. దేవాలయ సమీపంలో జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నాలు, తినుబండారాలు, పిల్లలు కొనుగోలు కోసం దుకాణాలు, చెరుకు గడల విక్రయాలు అధికంగా జరిగాయి.

సమస్యలపై ప్రత్యేక దృష్టి

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖల అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక మండపం వద్ద భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దర్శనానికి అవకాశం కల్పించారు.

పటిష్ట పోలీసు బందోబస్తు

తెనాలి డీఎస్పీ జనార్థనరావు పర్యవేక్షణలో జిల్లా పరిధిలోని 12 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 350 మందికిపైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్నదానం

క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆలయ సమీప ప్రాంతంలోని రెండు చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ప్రాంగణం వద్ద పులిహోర, పొంగలి, లడ్డూ, మజ్జిగ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని వివిధ భక్త బృందాలు ఏర్పాటు చేశాయి.

కిక్కిరిసినస వీఐపీ క్యూలైన్‌

మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం వద్దకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం కోసం క్యూలైన్‌లలో ఉన్న భక్తుల కంటే వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్‌లు కిక్కిరిసిపోయాయి. వేల సంఖ్యలో వీఐపీ పాసులను ఇష్టానుసారంగా పంపిణీ చేయటంతో సామాన్య భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. భక్తులు క్యూలైన్ల దాటి బయట వరకు దర్శనం కోసం వేచిఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, పొన్నూరు ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్‌ దర్శించుకున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీ వాస్తవ మానటరింగ్‌ పాయింట్‌ వద్ద గంటలకొద్దీ కూర్చుని భక్తుల రాకపోకలను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

హర హర మహాదేవ..1
1/5

హర హర మహాదేవ..

హర హర మహాదేవ..2
2/5

హర హర మహాదేవ..

హర హర మహాదేవ..3
3/5

హర హర మహాదేవ..

హర హర మహాదేవ..4
4/5

హర హర మహాదేవ..

హర హర మహాదేవ..5
5/5

హర హర మహాదేవ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement