కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్‌

Feb 16 2026 7:21 AM | Updated on Feb 16 2026 7:21 AM

కౌలు రైతులను   విస్మరించిన బడ్జెట్‌

కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్‌

కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్‌

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో కౌలు రైతుల పంట రుణాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో 70 శాతం సాగుభూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ప్రభుత్వం విస్మరించింది. అలాగే గుంటూరు జిల్లాకు నిధులు కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు చానల్‌ పర్చూరు వరకు పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేక పోవడం శోచనీయం. సంక్షేమ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు.

– పాశం రామారావు,

కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement