
కంటి తుడుపుగానే..!
కూటమి ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణానికి కేటాయించారు. వీటిలో రీజియన్ పరిధిలో అల్ట్రాడీలక్స్ బస్సులు 41 మాత్రమే ఉన్నాయి. పదుల సంఖ్యలోని ఆ బస్సుల్లో 10 లక్షల మందిపైగా మహిళలకు ఉచితం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇక పల్లెవెలుగు బస్సులు 215 మాత్రమే ఉండగా.. లక్షల మంది మహిళలకు ఆ బస్సులు సరిపోవనే చెప్పాలి. పైపెచ్చు పల్లెవెలుగు బస్సులు 100 కి.మీ పరిధిలో తిరగడానికి మాత్రమే ఉద్దేశించినవి కావడంతో ఉచిత ప్రయాణం జిల్లావరకే అనే విషయం తేటతెల్లమవుతోంది. ఏదో మాట ఇచ్చాం కాబట్టి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా ఉచిత ప్రయాణం అమలు చేయబోతున్నారనేది స్పష్టమవుతోంది. ఈమాత్రం దానికి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణమంటూ ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి ఎందుకు ఊదరగొట్టారంటూ మహిళలు కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.