
154 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు వెస్ట్: పేదలకందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన దుకాణంపై సివిల్ సప్‌లైస్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. చుట్టుగుంట సమీపంలోని శాంతి నగర్‌లో 174 వ రేషన్ దుకాణంలో సుమారు 154 బస్తాల బియ్యాన్ని, 475 అరకేజీ చక్కెర ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని దూదేకుల గాలీబుపై కేసు నమోదు చేశారు. ఈ నెల 1 నుంచి 15 వ తేదీ వరకు బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంచాలి. అయితే కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసింది. పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీని గత నెల నుంచి అమలు చేస్తోంది. ఈ విధానంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
వైభవంగా శ్రీనివాస కల్యాణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నగరంలోని ఆర్. అగ్రహారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి భక్త బృందం, వామనాశ్రమ స్వామిజీ వారి ఆధ్వర్యంలో చేపట్టారు. వామనాశ్రమ స్వామీజీ మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణం వల్ల వివాహా పవిత్రత, కుటుంబ విలువలు తెలుస్తాయని చెప్పారు. వేద పండితులు (తిరుపతి) శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త అనంతలక్ష్మీ (హైదరాబాద్) శ్రీనివాస వైభవాన్ని భక్తులకు తెలిపారు. అనంతరం స్వామిజీ భక్తులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్‌ఎస్‌ఆర్.ఆంజనేయులు, మహంకాళి శ్రీనివాసరావు, బాపారావు, రఘు, జుజ్జూరు శ్రీనివాసరావు. త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శనివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కు 316, బ్యాంక్ కెనాల్‌కు 1,807, తూర్పు కాలువకు 749, పశ్చివ కాలువకు 283, నిజాంపట్నం కాలువకు 488, కొమ్మూరు కాలువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక బ్యారేజీ నుంచి 1,89,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
దర్గాలో నిర్మాణాలు కూల్చివేత
పెదకాకాని: బాజీబాబా దర్గాలో శిథిలావస్థకు చేరిన గదుల నిర్మాణాలను వక్ఫ్‌బోర్డు అధికారులు పొక్లయిన్‌తో కూల్చివేయించారు. గత నెల 28న గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించిన వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ శిథిలావస్థకు చేరిన గదులు కూలితే భక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు దర్గా ఈఓ శనివారం షెడ్డును కూల్చివేయించారు. త్వరలో నూతనంగా గదులను నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
బళ్లారి రాఘవకు నివాళి
నరసరావుపేట: తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్లారి రాఘవ) జయంత్యుత్సవాలను కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. రాఘవ చిత్రపటానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సాహిత్యసేవను కొనియాడారు. డీఆర్‌ఓ ఏకా మురళి, అధికారులు పాల్గొన్నారు.

154 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

154 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

154 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత